Actress Sada | Health | Slim | Beauty | ఎంత తిన్నా నేను "బండ"లా మాత్రం మారను: సదా
కొందరు కొంచెం తింటే చాలు ఎంతో లావుగా మారిపోతారు. మరికొందరు ఏనుగులా ఆహారం లాగించినా బక్క పీనుగుల్లా ఉంటారు. అంత కాకపోయినా... ఎప్పుడూ ఒకే తరహాలో సన్నగా ఉంటారు. "అపరిచితుడు" వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత సదాకు తిరుగులేదనుకున్నారు అందరూ. కానీ అది పొరపాటని తేలిపోయింది. ఆమెకు పెద్దగా ఛాన్సులు రాలేదు.
ఆ చిత్రం తర్వాత సదా మరింత చిక్కినట్లు కనిపించింది. ఇదేమిటని అడిగితే.. నేను మొదట్నుంచీ ఇంతేనని చెపుతోంది. ఎంత తిన్నా లావుగా "బండ"లా మాత్రం మారను. నా శరీర తత్వమే అంత అని చెప్పింది.
నేడు పరిశ్రమలో జీరో సైజ్ హీరోయిన్ల ఫ్యాషన్‌గా మారింది. ఈ నేపధ్యంలో తాను ఎన్ని చిత్రాలు చేసినా ఫిగర్‌లో మార్పు రాక పోవడం వెనుక ఉన్న కారణం ఏమిటీ...? నువ్వేమీ తినవా..? అని తనను చాలామంది అడుగుతుంటారని చెపుతోంది సదా.
