Allari Naresh | Manjari Phadnis | Love | నీ లవ్వూ... నీ ఇష్టం అంటున్న అల్లరి నరేష్ ఫాదర్..?!!
WD
ఒకవేళ ఇలా తిరస్కారానికి గురైతే ఎంచక్కా ఇద్దరూ ఏదో గుడిలో పెళ్లి చేసుకుని వెళ్లిపోతున్నారు. ఇది గమనించిన పెద్దలు తమ ఆలోచనా సరళిని మార్చుకుంటున్నారు. పిల్లలు ఇష్టాన్ని కాదనుకుండా వారి ప్రేమకు ఓకే చెప్పేస్తున్నారు. దీనికి తాజా ఉదారణ సానియా - షోయబ్ పెళ్లి.
ఇంతకీ ఈ సంగతి ఇక్కడెందుకు చెప్పాల్సి వచ్చిందంటే... అల్లరి నరేష్ బాలీవుడ్ తార మంజరి ఫండిస్‌తో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయాడట. ఈ సంగతి తన తండ్రి ఇ.వి.వి సత్యనారాయణకు చెబితే, "నీ లవ్వూ నీ ఇష్టం. నీకు నచ్చిన వారెవరో చెపితే పెళ్లి చేస్తాం అని అన్నట్లు టాలీవుడ్ సినీజనం గుసగుసలు పోతున్నారు.
అన్నట్లు అల్లరి నరేష్‌కు ఇంతకుముందు గజాలాతో లవ్వాట సాగినట్లు వార్తలు వచ్చాయి. తొట్టిగ్యాంగ్ సినిమా తీసే సమయంలో అల్లరి నరేష్ గజాలాతో సుదీర్ఘ మంతనాలు చేసేవాడని అప్పట్లో గుసగుసలు వినిపించాయి. తాజాగా ఇప్పుడది మంజరి వంతవుతోంది. మరి ఇది కూడా ప్రేమా...? లేక సుదీర్ఘ మంతనాల వరకేనా..?
