Ileana | Tollywood | Kollywood | ఇలియానాను టాలీవుడ్ పొమ్మంటోందా...?
ఒక భాషలో నటిస్తే మరో భాషలో సినిమాలు మిస్ అవుతాయని తాను అనుకోవడం లేదని ఇలియానా చెపుతోంది. తమిళ చిత్రాల్లో నటిస్తే తెలుగులో అవకాశాలు పోతాయనే వాదనను కొట్టి వేస్తూ తెలుగులో తనకంటూ ప్రత్యేక స్థానముందని ధీమా వ్యక్తం చేస్తోంది.
ఇకపై తమిళ చిత్రాలకు ప్రాధాన్యత ఇస్తానని చెపుతోంది. ఈ మధ్య నితిన్, విష్ణువతో ఆమె నటించిన చిత్రాలు బోర్లా పడ్డాయి. దీంతో తమిళం వైపు మొగ్గు చూపుతోందని తెలుస్తోంది.
అన్నట్లు ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇలియానా అందాలకు మించిన అందగత్తెలు రంగప్రవేశం చేసిన దరిమిలా, ఇలియానా పక్క చూపులు చూస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
