Reema Sen | kiss | Bollywood | perfect kiss | రీమాకు ముద్దులే ముద్దులు.. 30 ముద్దులు పెట్టినా...
తేజ "చిత్రం"లో కవ్వించే నటనతో టీనేజ్ కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన రీమాసేన్ తాజాగా ఓ బాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. అక్కడి కుర్రాళ్లలో హీట్ రేకెత్తించాలనుకున్నదో ఏమోగానీ ఆ చిత్రం తాలూకు సన్నివేశంలో గాఢ చుంబన రుచి చూస్తున్నట్లు నటించింది.
అయితే ఆ ముద్దు పర్‌ఫెక్ట్‌గా రాలేదని సదరు చిత్ర దర్శకుడు రీమాసేన్‌ను హీరోతో ముద్దులపై ముద్దులు పెట్టించాడట. చివరికి 30వ ముద్దు పక్కాగా రావడంతో హీరో ముద్దు పెట్టడం ఆపేశాడట. రీమా మాత్రం ఇంకా ముద్దులు పెడతాడేమోనన్నట్లు ఎదురు చూసిందట.
ఆ తర్వాత ముద్దుల సీన్ గురించి రీమాను కదిలిస్తే... ఖచ్చితంగా ఎన్ని ముద్దులు పెట్టించుకున్నానో నేను లెక్క వేయలేదు. అయినా ఆ ముద్దులు పెట్టింది పెదవులపై కాదుకదా... బుగ్గపై పెట్టిన ముద్దులవి. అక్కడ ఎన్ని ముద్దులు పెడితే ఏమవుతుందీ.. అందుకే ఎన్ని టేకులు చెప్పినా నా బుగ్గలను వాటికి అప్పజెప్పేశా... అని నవ్వుతూ చెప్పిందట రీమా.
కొసమెరుపు ఏంటంటే... ఆ రోజు షూటింగ్ షెడ్యూల్ అంతా ఒక్క ముద్దు సీన్‌తోనే ముగిసిందట. కొత్త హీరో మాత్రం షూటింగ్ ముగిసినా పెదవులను సున్నంలా చుడుతూ రీమాసేన్ బుగ్గలవైపు ఆబగా చూస్తునే ఉన్నాడట. ట్రెయినింగ్ అంటే ఇదేనేమో...?!!
