MS Raju | Chandi | Kajal Agarwal | Producers Council members | Film Chamber | "చండీ" నుంచి కాజల్‌ను గెంటేసిన ఎమ్మెస్ రాజు..?!!
సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ ఎమ్మెస్ రాజు క్రమశిక్షణకు మారుపేరు అని సినీ ఇండస్ట్రీలో పేరు. సినీ నిర్మాతలు ఖర్చులను తగ్గించుకోవాలని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేసిన నేపధ్యంలో తొలిసారిగా దానిని ఆచరణలో పెట్టారు రాజు.
తను నిర్మిస్తున్న తదుపరి చిత్రం చండీకి గాను కాజల్ అగర్వాల్ పారితోషికం చుక్కలను చూస్తూ ఉండటంతో ఆమెను సదరు చిత్రం నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ స్థానంలో మరో కొత్త హీరోయిన్‌ను ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇలాంటి నిర్ణయాల వల్ల భారీ పారితోషికాలను ఆశిస్తున్న హీరోహీరోయిన్లు క్రమంగా తమ రేట్లను తగ్గించుకోక తప్పదు. లేదంటే వారి స్థానాలను కొత్తవాళ్లు ఆక్రమించుకోవడం ఖాయం.
నిర్మాతలు అనుకుంటే ఇండస్ట్రీని గాడిలో పెట్టవచ్చని, మిగిలిన నిర్మాతలు కూడా ఎమ్మెస్ రాజుగారి బాటలో పయనిస్తే నిర్మాతలకు కష్టాలు చాలా వరకూ తగ్గిపోతాయంటున్నారు సినీ విశ్లేషకులు.
