1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. Sruti Haasan

Sidharth | Sruti Haasan | Kamal Hasan | Yodha | Dasavataram | Boys | సిద్ధార్థతో ప్రేమా..? అవన్నీ వదంతులే..!: శృతిహాసన్

సిద్ధార్థ
WD
పద్మభూషణ్, దశావతారం హీరో కమల్ హాసన్ కుమార్తె శ్రుతిహాసన్‌ కథానాయికగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తెలుగులో ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో "బాయ్స్" బాయ్, ఎనర్జిటిక్ హీరో సిద్ధార్థ కథానాయకుడిగా నటిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో కమల్ కుమార్తె శ్రుతి హాసన్ సిద్ధార్థను ప్రేమిస్తుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. అయితే తనపై వచ్చిన ప్రేమ వార్తలను శృతిహాసన్ కొట్టిపారేసింది. సోహా అలీఖాన్‌కు ఫుల్‌స్టాప్ పెట్టి హీరో సిద్ధార్థ శృతితో చాలా చనువుగా ఉంటున్నాడని వార్తలు వచ్చాయి.

ఈ విషయమై శృతిహాసన్ మాట్లాడుతూ.. "మేమిద్దరం ప్రేమించుకున్నామనేది ఆధారం లేని మాట" అని కోపంతో చిందులేసింది. "ఇద్దరం కలిసి తెలుగు సినిమాలో నటిస్తున్నాం. ఓ సహనటుడితో ఓ నటి ఎలా ఉండాలో..? అలాగే ఉన్నాను. అంతేగానీ సిద్ధార్థతో ఇంకేమీలేదని.." శృతి స్పష్టం చేసింది. ఇకపోతే.. సిద్ధార్థ-శృతిహాసన్ జంటగా నటిస్తోన్న చిత్రానికి "యోధ" అనే పేరు పరిశీలనలో ఉంది.
About Writer
SELVI.M