Actress Sonam Kapoor | cow dung | Imran | Love song | New Zealand | పేడలో పడ్డ సోనం కపూర్: జిల్లాయిలే.. జీడిపప్పులే..!!
బాలీవుడ్ తార సోనంకపూర్ హీరో ఇమ్రాన్ జంటగా ఓ బాలీవుడ్ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో సోనం ఓ లవ్ సాంగ్ పాడుతూ, తన శరీరాన్నంతటినీ వయ్యారంగా హీరో చేతుల్లో పెట్టి పరవశించిపోయే సన్నివేశం ఒకటి తీయాల్సి ఉంది. ఎంతకీ సీన్ తను అనుకున్నట్లు రాకపోవడంతో దర్శకుడు ఇద్దరిపై కోపాన్ని ప్రదర్శించాడు. సోనంనైతే... ఏమ్మా... వాటేసుకుని సుతారంగా వెనక్కి ఒరగటం చేతకాదా... అని గదమాయించి, రెడీ... 1... 2.. 3.. యాక్షన్... అన్నాడట.
అంతే హీరోహీరోయిన్లిద్దరూ ఒకరికొకరు వాటేసుకున్నారు. ఆ తర్వాత హీరో కౌగిలి నుంచి హీరోయిన్ సోనం మెల్లిగా వెనక్కి ఒంగుతూ ఒక దశలో ఆగిపోయింది. అయితే దర్శకుడు ఆమెను చూసి, "ఇంకా వంగాలమ్మా..." అన్నాడట.. దాంతో హీరోయిన్ తన శరీరాన్ని మరికాస్త వెనక్కి వంచిందట... దర్శకుడు.. ఇంకాస్తా.. ఇంకాస్తా... ఇంకాస్తా.. అంటూ ఆమె వెన్ను విల్లులా వెనక్కి వంగేవరకూ అంటూనే ఉన్నాడట.
హీరోయిన్ అంతగా వంగేసరికి ఆమె బరువును ఆపలేని హీరో తన చేతులను వదలిపెట్టేశాడట. అంతే... అమ్మడు ధబేల్‌మని కింద పడిపోయిందట. కింద పడితే ఏంటట... అని మీరడగవచ్చు. మీరే కాదు సోనం కూడా అడిగిందట అక్కడి యూనిట్ సభ్యులను... నా వీపు వెనుక ఏదో జిగటలాంటి పదార్థం అతుక్కుని ఉన్నదని చూడమందట.
