Anchor Udayabhanu | Leader | Item Girl | ఉదయభాను "లీడర్" ఐటెం దెబ్బకు కంపెనీలు "క్యూ"
ఈమధ్య హీరోయిన్లే ఐటెంసాంగ్స్ చేస్తుండటంతో గతంలోలా ప్రత్యేకంగా ఐటెంగాళ్స్ వెతుక్కోనవసరం లేకుండా పోయింది. అయితే హీరోయిన్‌గా ఎంటర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చి రెండు, మూడు సినిమాల్లో నటించిన ఉదయభానుకు "లీడర్" సినిమాలో ఐటెంసాంగ్‌కు మంచి క్రేజ్ వచ్చింది.
మొదట్లో ఈ భామను వాంప్‌కు బాగా పనికొస్తావని ఆమె స్నేహితులు సలహా యిస్తే వారిని మందలించింది. ఆ పాత్రలు వేయడానికి ఇష్టపడని ఉదయభాను టీవీ మీడియాపై దృష్టి సారించి సక్సెస్ అయింది. ఆ బుల్లితెరలో ఆమె ఒలకబోసిన హావభావాలకు శేఖర్ కమ్ముల తన చిత్రంలో వినియోగించుకున్నాడు. దీంతో ఆమెకు డిమాండ్ పెరిగింది. ప్రముఖ నిర్మాతలు ఆమెను తమ తమ చిత్రాల్లో అటువంటి ఆఫర్లే ఇస్తే.. సున్నితంగా తిరస్కరించింది.
బ్యానర్, హీరో, దర్శకుడు స్థాయిని బట్టి చేస్తానని నిర్మొహమాటంగా చెప్పేసింది. అయితే ఆమెను మరోలా ఉపయోగించుకోవాలనుకున్న మార్కెటింగ్ మేధావులు మాయశ్చరైజర్ ఆయిల్ కంపెనీకి ప్రమోటర్‌గా వినియోగించుకుంటున్నారు. ఇప్పుడు ఆమె అటువంటి వాటికి "సై" అంటోంది. పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఆమెకు ఆహ్వానం పలికేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో ఆమె రేంజ్ పెరిగింది.
