1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. Prabhu

Sindhu Menon | Prabhu | Chandamama | Wedding bells | Subadra | "చందమామ" బొమ్మ ''సింధుమీనన్‌''కు పెళ్లంట..!?

సింధు మీనన్
WD
"చందమామ" చిత్రంలో కాజల్ అగర్వాల్ సరసన హోమ్లీ అందాలతో ప్రేక్షకులకు పరిచయమైన అందాల తార "సింధుమీనన్" త్వరలో పెళ్లి కూతురు కాబోతుందట..!. ఇప్పటికే యూకేకు చెందిన వాణిజ్య వేత్త ప్రభుతో సింధుమీనన్‌కు ఎంగేజ్‌మెంట్ అయిపోయిందని సినీ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి.

దక్షిణాది సినిమాల్లో నటించిన సింధుమీనన్.. తాజాగా తెలుగులో "సుభద్ర" అనే చిత్రంలో లేడి ఓరియెంటెడ్ రోల్ చేస్తోంది. త్రినేత్రం, శ్రీరామ చంద్రులు, ఆడు అంతే.. అదో టైపు వంటి పలు చిత్రాల్లో సింధుమీనన్ నటించినా.. కృష్ణవంశీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న "చందమామ" చిత్రం మంచి గుర్తింపును సంపాదించిపెట్టింది.

క్లాసికల్ డ్యాన్సర్ అయిన సింధు మీనన్ "రష్మీ" అనే కన్నడ సినిమాలో అతి చిన్న వయస్సులోనే నటించింది. హోమ్లీ పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న కేరళ అమ్మాయి సింధుమీనన్‌-ప్రభుల నిశ్చితార్థం త్రిశూర్‌లో జరిగిందని ఫిలిమ్ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.

త్రిశూర్‌లోని కున్నకులం గ్రామంలో సాంప్రదాయబద్ధంగా సింధుమీనన్-ప్రభుల ఎంగేజ్‌మెంట్ జరిగిందని సినీజనం అంటున్నారు. అయితే సింధుమీనన్ పెళ్లి తేదీ మాత్రం ఇంకా తెలియరాలేదు. ఇంకేముంది..? ప్రస్తుతానికి ఏవో రెండు సినిమాన షూటింగ్‌లతో బిజీగా ఉన్న సింధుమీనన్‌కు విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చెప్పేద్దామా..!?
About Writer
SELVI.M