తాగుడుకు బానిసైన "ఆది" హీరోయిన్ కీర్తిచావ్లా..!?
"ఆది" సినిమాలో కథానాయికగా నటించిన అందాల ముద్దుగుమ్మ కీర్తిచావ్లా. ఆది తర్వాత నాలుగైదు సినిమాల్లో చేసినా అమ్మడు ఏ మాత్రం రాణించలేదు. ఈ క్రమంలో కొన్నాళ్ల తర్వాత తెలుగు తెరకు కీర్తి చావ్లా దూరమైంది. అయితే తమిళ సినీపరిశ్రమలో మాత్రం కీర్తిచావ్లాకు మంచి ఛాన్సులు వస్తున్నాయని సినీజనం గుసగుసలాడుకుంటున్నారు.
కానీ కీర్తిచావ్లా బాగా తాగుడికి అలవాడు పడిందని సమాచారం. డైరక్ట్‌గా షూటింగ్ సెట్స్‌కి వచ్చేటప్పుడే మందు కొట్టి వచ్చేస్తుందని సినీ వర్గాల టాక్. ఇంకా ఏ మాత్రం జంకు లేకుండా మందుకొట్టి డేర్‌గా వస్తున్న ఆమెను మిగతావారు చూసి ఖంగు తింటున్నారట. ఇటీవలే "సాధ్యం" సినిమాలో ఒక పాత్ర పోషించిన కీర్తిచావ్లా.. అక్కడ కూడా మందు కొట్టి ఇదే సీన్ చేసిందట.!. షూటింగ్‌లకు లేటుగా రావడంతో ఆమెను బుక్ చేసుకున్న దర్శకులు, నిర్మాతలు తెగ ఇబ్బందులు పడుతున్నారని తెలిసింది.
ఒక్క సినిమాతోనే హిట్ కొట్టిన తర్వాత అవకాశం రాకపోవడంతో..? కీర్తిచావ్లా తాగుడుకు బానిసయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ తాగుడుని కంట్రోల్ చేస్తేనే కీర్తిచావ్లా సినీ కెరీర్ బాగుంటుందని ఇండస్ట్రీ భావిస్తోంది. మరి.. కీర్తిచావ్లా తాగుడుకు గుడ్‌బై చెబుతుందో..? లేదో వేచి చూడాల్సిందే..?

