Komaram Puli | Pavan Kalyan | Telangana | Chiranjeevi | వచ్చేస్తానంటున్న "సమైక్య"పులి... కుయ్యోమంటున్న " కొమరం పులి"
WD
ఇప్పటికే కొమరం పులి చిత్రాన్ని తెలంగాణాలో అడ్డుకుంటామని తెలంగాణా జేఏసి నాయకులు హెచ్చరించారు. దీంతో చిత్ర నిర్మాత సింగమల రమేష్ విపరీతమైన ఒత్తిడికి లోనై ఆస్పత్రిలో జాయిన్ అయినట్లు సమాచారం. కోట్లు ఖర్చుపెట్టి కొమరం పులిని తెరకెక్కించాననీ, ఒకవేళ తెలంగాణాలో ఆ చిత్రాన్ని అడ్డుకుంటే పరిస్థితి ఏమిటన్న ఆందోళనలో రమేష్ ఉన్నట్లు సమాచారం.
ఇదిలావుంటే సమైక్యవాదాన్ని సమర్థించిన నందమూరి హరికృష్ణ సోదరుడు, రాష్ట్రంలోని రెండు ప్రాంతాలు రెండు కళ్లని చెపుతున్న తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు బావమరిది బాలకృష్ణ చిత్రం "సింహా"కు తెలంగాణాలో ఎక్కడా ఏ అడ్డంకులు ఎదురు కాకపోవడం గమనార్హం. తెలంగాణావాదులు "సింహా"ను ఎందుకు అడ్డుకోలేదన్న విషయంపై కొమరం పులి దృష్టి సారిస్తే మంచిదేమో...!!
