1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. Balakrishna

Chiranjeevi | Balakrishna | Tollywood | Prajarajayam | బాలయ్య సినిమా - చిరంజీవి యాక్టింగ్...?!!

చిరంజీవి
WD
త్వరలో చిరంజీవి వెండితెరపై కన్పించనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఒక సందేశాత్మక చిత్రంలో చిరంజీవి నటించనున్నారనే వార్తలు ఇటీవల ఫిలిమ్ నగర్‌లో ఊపందుకున్నాయి. ఈ చిత్రానికి వాసు దర్శకత్వం వహించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

సామాజిక చైతన్యం కోసమే చిరంజీవి మళ్లీ ఈ చిత్రంలో నటించనున్నారని ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. ఈ సినిమాకోసం ఇప్పటికే పరుచూరి బ్రదర్స్ స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే కోడి రామకృష్ణ ఇటీవల చిరంజీవిని కలిసి చాలాసేపు చర్చించినట్లు టాలీవుడ్ టాక్.

చిరంజీవి కోసమే తాను ఓ కథను సిద్ధం చేశాననీ, చిరు తన మనసు మార్చుకుంటే ఆయనతో సినిమా చేయాలని "కోడి" అనుకుంటున్నట్లు భోగట్టా. ఇదిలావుంటే మొదట్లో చిరంజీవితో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను తీయాలని అనుకున్నారు. అయితే నరసింహనాయుడు సమరసింహారెడ్డి వంటి చిత్రాలలో నటించి సక్సెస్‌లు సాధించిన బాలయ్య అయితే ఈ చిత్రానికి సరిపోతాడని మరికొందరు ఆయన చెవిన వేశారు.

దానికి బాలయ్య సరే అన్నట్లు వార్తలు వచ్చినా ఆ తర్వాత ఎందుకనో వాయిదా పడిందట. అయితే ఈ కథను చిరంజీవితో తీస్తే రాయలసీమలో చిరుకి గ్లామర్ పెరగడమే కాక సినిమా బాగా హిట్ అవుతుందని కొంతమంది చిరు చెవిన వేశారు. ఇది తెలిసిన బాలయ్య కస్సుబుస్సు లాడారట. అదలావుంచితే ఈ సినిమా కోసమే చిరంజీవి స్లిమ్‌గా మారారనీ, ఆయనే ఆ సినిమా చేస్తారని బలంగా వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఇద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుందో వేచి చూడాలి...
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT