1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. food

ఎంత పెట్టినా ఇంకా కావాలంటున్న తిండిబోతు త్రిష

త్రిష
త్రిష పెద్ద తిండిబోతట. షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్లిన దగ్గర్నుంచి నోటిని ఆడిస్తూనే ఉంటుందట. అంతేకాదు... ఈ బక్కపలచని భామకు రోజుకో వెరైటీ ఫుడ్ ఐటమ్ కావాలట. 

ఈ వెరైటీలను తెచ్చి పెట్టలేక త్రిష మామ్ ఉమ ఒకింత ఇబ్బంది పడుతోందట. కానీ త్రిష మాత్రం తన తిండిని ఏమాత్రం తగ్గించుకోవడం లేదట. తనకు ఇష్టమైన ఆహారపదార్థాలను గొంతుకాన తినేసి ఆ తర్వాత బరువు పెరుగుతానేమోనని తెగ బాధపడిపోతుందట.

నోటికి అందినది అందినట్లు తిన్నందుకు కొవ్వు పెరుగుతుంది కనుక ఆ కొవ్వును కరిగించుకునేందుకు తగిన వ్యాయామం చేయకపోతే బండలా మారిపోతానేమోనని భయపడి, ట్రెడ్ మిల్‌పై గంటలకొద్దీ పరుగులు తీస్తుందట. తిన్నదంతా అరిగిపోయి నీరసం వచ్చేవరకూ అదే పనిగా వ్యాయామం చేస్తుందట.

అయితే ఇటీవల కాలంలో సినిమా ఛాన్సులు కాస్త తగ్గడంతో ఇంట్లో కూచుని నోటికి పని చెప్పడమే పెద్దపనిగా పెట్టుకున్నదట. కడుపారా తిన్న తర్వాత హ్యాపీగా మంచి నిద్ర లాగించేస్తుందట. వ్యాయామాన్ని మరిచి కొంచెం బొద్దుగా కూడా మారిందట. ఒక్కసారి "బండ"లా మారితే ఇక స్లిమ్‌గా మారడం చాలా కష్టమని త్రిషకు తెలుసో లేదో మరి..!!
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలైన ETv, ETv2లో పనిచేసారు. స్వాతి సపరివారపత్రిక, సండే ఇండియన్ మ్యాగజైన్ల ఎడిటోరియర్ విభాగంలో పనిచేసారు. 2006 నుంచి వెబ్ దునియా తెలుగు- Webdunia Telugu సహ సంపాదకునిగా వ్యవహరిస్తున్నారు. .... మరింత చదవండి