Shreya | Sexy actress | Don Seenu | Ravi Teja | పనికిమాలిన పాత్రలు చేయనంటే చేయను: శ్రేయ
ప్రాధాన్యం లేని పనికిమాలిన పాత్రలు ఎట్టి పరిస్థితుల్లో చేయబోనని సెక్సీ నడుము చిన్నది శ్రేయ చరణ్ అంటోంది. ప్రస్తుతం తెలుగులో "డాన్ శీను" చిత్రంలో నటిస్తున్న శ్రేయ తమళంలో కందసామి, కుట్టీ వంటి చిత్రాలు చేసింది. ఈ చిత్రాల తర్వాత ఆమెకు అనుకున్నంత స్థాయిలో అవకాశాలు రాలేదు.
పైగా టాలీవుడ్ - కోలీవుడ్ సినీ పరిశ్రమల్లో కొత్తగా వస్తున్న తారలంతా పొట్టి దుస్తులు ధరించి తొడల అందాలను ఆరబోస్తూ ఎట్రాక్ట్ చేసే విషయంలో చాలా ముందుంటున్నారు. ఈ రేసులో మాత్రం శ్రేయ వంటి తారలు కాస్తంత వెనకబడి పోయారనడంలో సందేహం లేదు. అయితే ఇటీవల త్రిష తొడల ఎక్స్ పోజింగ్‌లు చేస్తూ కొత్తవారికి సైతం గట్టి పోటీ ఇస్తోంది.
అయితే శ్రేయ మాత్రం ప్రాధాన్యమున్న పాత్రలలోనే నటిస్తాననీ భీష్మించుకు కూచుంది. అంటే... ఎక్స్‌పోజింగ్‌కు అవకాశమున్న పాత్రలు చేయరా..? అని ప్రశ్నిస్తే, ప్రాధాన్యమున్న పాత్రల్లో ఎక్స్‌పోజింగ్ ఉండకూడదని మీరెందుకు అనుకుంటున్నారు అని ఎదుర ప్రశ్న వేసింది. సెక్సీ భాగాలను అత్యంత సెక్సీగా చూపించే అవకాశాన్ని తాను ఏమాత్రం చేజార్చుకోననీ, అయితే దాని ద్వారా తనకు తప్పనిసరిగా గుర్తింపు రావాలని అంటోంది.
