1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. Ram Charan Teja

Kajal Agarwal | Ram Charan Teja | Merupu | రామ్ చరణ్ కళ్లలో ఏదో తెలియని శక్తి ఉంది: కాజల్

కాజల్ అగర్వాల్
WD
మగధీర చిత్రం తర్వాత మెరుపు చిత్రంతో మరోసారి రామ్ చరణ్ తేజతో జోడి కడుతున్న కాజల్ అగర్వాల్ రామ్ చరణ్‌పై పొగడ్తల వర్షం కురిపిస్తోంది. రామ్ చరణ్ కళ్లలో ఏదో తెలియని శక్తి ఉన్నదనీ చెపుతోంది. సెట్స్‌లో చాలా చురుకుగా ఉండే చరణ్, అనుకున్నవిధంగా సీన్ వచ్చేవరకూ మహా పట్టుదలగా చేస్తారని అన్నది.

అంతేకాదు మానసిక వైకల్యంతో బాధపడుతున్న 100 మంది అనాధ బాలలకు అన్నీ తానై వారికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారని చెప్పింది.

మగధీర చిత్రం సమయంలో చెప్పని సంగతులు మెరుపు చిత్రం ప్రారంభమైన సందర్భంలో చెప్పడానికి గల కారణాలు ఏమిటి మిస్... అని ఓ తుంటరి కుర్ర జర్నలిస్టు ప్రశ్నిస్తే... ఏది ఎప్పుడు చెప్పాలో తనకు తెలుసని చెపుతూ రెండు కళ్లను పెద్దవి చేసి గుడ్లురిమి చూసింది. అలా చూస్తే ఎవరు మాత్రం ఏం మాట్లాడుతారూ..?
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT