1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Rama rama Krishna krishna

Bindu Madhavi | Rama rama Krishna krishna | Tollywood | ఇండస్ట్రీ నన్ను బాగా చూసుకుంటోది: బిందు మాధవి

బిందు మాధవి
ఇండస్ట్రీలోకి రాకమునుపు దాని గురించి చాలా విన్నాను. కానీ వచ్చాక... తెలిసింది అసలు నిజం ఏమిటో అని అంటోంది దబ్బముక్కు చిన్నది బిందు మాధవి. కొంతమంది తనను... " తెలుగమ్మాయివి కదా... ఇండస్ట్రీలో నిన్ను ఎలా చూస్తున్నారూ..?" అని ప్రశ్నిస్తుంటారని చెప్పుకొచ్చింది.

దీనికి తను సమాధానం చెపుతూ... తెలుగు ఇండస్ట్రీ తనను బాలీవుడ్ తారలకంటే బాగానే చూసుకుంటోందని చెప్పింది. తనను ఎప్పుడూ చిన్నచూపు చూడలేదని అంటోంది. ఆవకాయ్ బిర్యానీ, బంపర్ ఆఫర్ చిత్రాల్లో నటించినా పెద్దగా పేరు రాకపోయినా రామ్ సరసన "రామరామ కృష్ణకృష్ణ"లో మాత్రం మంచి పాత్ర వేశానని పొంగి పోతోంది. ఈ పాత్ర ద్వారా తనకు మంచి గుర్తింపు వస్తుందని చెపుతోంది.

ఎటువంటి బ్యానర్లో నటించాలనుంది అనడిగితే, అన్ని బ్యానర్లు మంచివే. చెడ్డ బ్యానర్లూ.. చెడ్డ వ్యక్తులూ అంటూ ఇక్కడ ఏదీ లేదని కితాబిస్తోంది. ఆమె అనుభవం వరకూ ఇది నిజమేనేమోనని కొందరు గుసగుసలాడుకోవడం కనిపించింది.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT