Actress Genelia | Life partner | He man | జెనీలియాకు సరైన "మగాడు" దొరకడం లేదట
FILE
అందమైన చిరునవ్వును కలిగి, సంప్రదాయ దుస్తుల్లో ఓ అందమైన మగాడు తన కంటికి ఇప్పటివరకూ కనబడలేదని వాపోతోందట జెనీలియా. మరి ఎంతగానో ప్రేమించిన రితేష్ దేశ్‌ముఖ్ సంగతో... అని అడిగితే, అతడా.... అతడి గురించి నేనేమీ చెప్పలేనని సమాధానాన్ని దాట వేసిందట.
అదిసరే నీకు నచ్చే మగాడికి ఇంకా ఎటువంటి లక్షణాలుండాలని కోరుకుంటున్నావ్ అని అడిగితే... పళ్లు బిగించి ఎప్పుడూ కొంప మునిగిపోయేలా కూచుని ఉండేవారంటే నాకు నచ్చదు. అతడు నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి. అలాగని వెకిలి చేష్టలు చేస్తే మండుతుంది.
ఎటువంటి భేషజాలకు పోకుండా మంచి వస్త్రధారణతో నలుగురిలోను అతడే ప్రత్యేకంగా కనబడాలి. సిగార్... వగైరా వగైరా... అలవాట్లు ఉండకూడదు. అన్నిటికీ మించి అతడు మంచి డ్యాన్సరై ఉండాలి. అటువంటి వ్యక్తి నా హృదయాన్ని గెలుచుకోగలడు...
వామ్మో... ఇంత పర్ఫెక్ట్ మగాడు ఈ కాలంలోనూ దొరుకుతాడంటారా...?!! జెనీలియా అటువంటివాడికోసం చూస్తుంది కదా... మనమూ చూద్దాం..!!
