Ram Gopal Varma | Hollywood | Puri Jagannath | Bollywood | హాలీవుడ్‌కు వర్మ... బాలీవుడ్‌కు పూరీ
WD
సహజంగా హాలీవుడ్ చిత్రాలంటే ఎంతో రిచ్‌గానూ, రోమాలు నిక్కబొడుచుకునేంత సస్పెన్స్‌తోనూ సాగుతుంటాయి. ఎలాగూ రామ్ గోపాల్ వర్మ అటువంటి సినిమాలను అందించండంలో అందెవేసిన చేయి గనుక ఆయన టేకింగ్‌ను చూసిన కొన్ని హాలీవుడ్ సంస్థలు వర్మపై దృష్టి సారించినట్లు భోగట్టా.
ఇదిలావుంటే "ఇడియట్" ద్వారా తెలుగు ఇండస్ట్రీలో అదరహో అనిపించుకున్న పూరీ జగన్నాథ్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. తమిళ నటుడు సూర్య హీరోగా రామ్ గోపాల్ వర్మ నిర్మించే చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం.
మరోవైపు లేటెస్ట్‌గా బాలకృష్ణ హీరోగా చేస్తున్న చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది. మొత్తమ్మీద తెలుగు దర్శకులు బాలీవుడ్ - హాలీవుడ్ రేంజ్‌లకు వెళ్లడం గర్వించదగ్గ విషయం కదా...
