1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Bollywood

shiney ahuja |Bollywood | Soha Ali Khan | Preity Zinta | రేపిస్టు హీరోతోనా...?!! బాబోయ్ మేం నటించం: హీరోయిన్లు

షీనె అహూజా
పనిమనిషినిపై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో బాలీవుడ్ నటుడు షీనె బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఆ తర్వాత కొన్నాళ్లు గ్యాప్ తీసుకుని తాజాగా ఓ చిత్రంలో నటించేందుకు అంగీకరించాడు. అయితే అతడితో కలిసి నటించేందుకు ఓ కథానాయిక ముందుకు రావడం లేదు. షీనె పేరు చెబితేనే భయపడిపోతున్నారట. 

ఇంతకుముందు "ఏన్ యాక్సిడెంట్" చిత్రంలో కొన్ని సన్నివేశాలలో షీనెతో సోహా ఆలీఖాన్ నటించింది. ఆ తర్వాత షీనె అత్యాచారం కేసులో ఇరుక్కున్నాడు. దీంతో ఆ ప్రాజెక్టులో నటించేందుకు అంగీకరించిన ప్రీతి జింతా సైతం పరుగు లంకించుకుని బయటపడింది. ఇక ప్రస్తుతం మరో హీరోయిన్ వేటకోసం హీరో షీనె నానా తంటాలు పడుతున్నాడట.

చివరికి షెర్లిన్ చోప్రా వంటి బాలీవుడ్ బాంబ్ షెల్స్ షీనెతో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారట. మరి షీనె వారితో సరిపెట్టుకుంటాడో... లేదంటే సంప్రదాయమైన హీరోయిన్ కోసం వేచి చూస్తాడో...?!!
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT