1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. Cinema

Director Teja | Cinema | Nitin | Beverages | కబ్జా గొడవల్లో "జయం" తేజ గుట్టు రట్టయింది

దర్శకుడు
FILE
కెమేరామెన్ నుంచి దర్శకుడిగా మారి ఆ తర్వాత పలు రకాలుగా వార్తల్లోకి ఎక్కిన తేజ ఇటీవలే నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఇంటిని కబ్జా చేసినట్లు పెద్ద గొడవ జరిగింది. ఆ తర్వాత ఆ కేసు కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఆ గొడవల్లో ఆయన వ్యక్తిగత విషయాలు బయటకు వచ్చాయి.

సినిమా షూటింగ్‌లో ప్రొడక్షన్ వ్యవహారాలలో కూడా ఆయన తన తలను దూర్చేవాడట. కాస్ట్యూమ్స్ విషయంలో... ఇతర దేశాల నుంచి, ముంబై నుంచి తెప్పించినట్లు బిల్లులు రాసి హైదరాబాదులోని కోఠిలో ఫ్లాట్‌ఫాంపై తెచ్చి వేసినట్లు ఆమధ్య నితిన్ బయటపెట్టాడు.

ఇదిలావుంటే, ప్రస్తుతం మరో నిర్మాత ఈయన బండారాన్ని వేలెత్తి చూపినట్లు విశ్వసనీయ సమాచారం. సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ కాక్‌టైల్ సంస్థ యూనిట్‌కు మందు బాటిళ్లు సప్లయ్ చేస్తే... వాటిని వారికి అందజేయకుండా తన ఆఫీసులో కొద్దికాలం పెట్టుకుని అమ్మే ప్రయత్నం చేశాడట. దీంతో ఈ విషయం తెలిసిన ఆ కంపెనీ తేజ చీప్ మెంటాలిటీ తెలుసుకుని ఆయనతో సంబంధాలను రద్దు చేసుకుంది.

విశేషం ఏమిటంటే... తాను నిర్మించబోయే మరో చిత్రంలో ఓ సన్నివేశంలో పబ్ కల్చర్ ఉండాల్సి ఉంది. దీంతో ఈ విషయంపై ఓ పబ్‌ను సంప్రదించగా... వారికి గతంలో తేజ గురించి తెలిసి తెలివిగా తప్పించుకున్నారట. అవును మరి... ఒకసారి నమ్మకం పోతే ఎంత నమ్మిద్దామని చూసినా ఎవరూ నమ్మరు గాక నమ్మరు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT