1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Hot Actress

Actress Charmi | Hot Actress | Boy Friend | Devisri Prasad | Romance | మగ స్నేహితుడితో ఛార్మి చెట్టాపట్టాల్: "టప్"మన్న కెరీర్

ఛార్మి
నటి ఛార్మి కెరీర్ చాలా నెమ్మదించింది. దీనికి ప్రధాన కారణం ఆమె స్నేహితుడు దేవీశ్రీప్రసాద్ అని ఇండస్ట్రీ భావిస్తోంది. తన కెరీర్‌కంటే నిజజీవితంలో కెరీర్‌నే ఛార్మి చూసుకుంటోందని ఫిలింనగర్ వాసుల కథనం. ఇటీవల దాదాపుగా ఆమె కనుమరుగయిపోయింది. 

సక్సెస్‌లు లేకపోవడం ఒక ఎత్తయితే మరోవైపు షంషాబాద్ శివార్లలో ఆమె రిసార్ట్స్ ఒకటి ఉన్నది. దానిలో ఇండస్ట్రీలోని ప్రముఖుల పుత్ర రత్నాలు గలాటా చేయడంతో అది కాస్తా కోర్టు గడప దాకా వెళ్లి అక్కడే తిష్టవేసి కూచుంది. అయితే సినిమాలు తగ్గడానికి ప్రధాన కారణం ఆమె ప్రేమలో పీకల్లోతు కూరుకుపోవడమేనన్న వార్తలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి.

ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ తో ఆమె చెట్టాపట్టాల్ వేసుకు తిరుగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఆ వార్తలను దేవీశ్రీప్రసాద్ ఖండించినా.... ఆమెను పూర్తిగా తనవైపు తిప్పుకున్నాడనీ, అందుకే ఆమె సినిమాలు చేయలేకపోతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఎన్నో సినిమా ప్రేమల్లో నటించిన ఛార్మి, నిజజీవితంలో ఆ ప్రేమ కాటుకు గురై దాని నుంచి బయటపడలేకపోతోందని పలువురు అంటున్నారు. మరి దేవీశ్రీప్రసాద్‌తో ప్రేమాయణం ఛార్మి కెరీర్‌ను ఎటువైపు తీసుకెళుతుందో చూడాల్సిందే.

తాజాగా ఆమె "సయ్యాట" అనే చిత్రంలో నటించింది. ముందుగా ఈ చిత్రంలో దేవీశ్రీ హీరోగా నటిస్తున్నట్లు గుప్పుమంది. అయితే ఆ తర్వాత అందులో ఓ పాత్ర వేస్తున్నట్లు మాత్రమే చెపుతున్నారు. ఏదేమైనా వీరి కథ సినిమా కథ అవుతుందో... సినీ ప్రేమజంటలకు ఆదర్శమవుతుందో వేచి చూడాలి..!!
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT