1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Marriage

Sindhu Menon | Marriage | Kiss | సంసార రుచులు చూశాకే ఏదైనా...: సింధుమీనన్

సింధు మీనన్
ఎంబీఎ పూర్తి చేసిన నటి సింధుమీనన్ "చందమామ" చిత్రంలో చలాకీగా నటించింది. తాజాగా ఆమె నటించిన చిత్రాలు "ప్రేమ పిలుస్తోంది", "సుభద్ర" విడుదల కావాల్సి ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ భామ వివాహ ప్రయత్నాల్లో జోరుగా ఉంది. 

దీని గురించి ఆమెను అడిగితే.. ఆయన లండన్‌లో స్థిరపడ్డారు. అందుకే నేను కూడా అక్కడికి వెళ్లాలి. సంసార రుచులు చూశాక ఎప్పుడైనా బోర్ కొడితే నటిస్తానేమో. అంతవరకూ నటనకు బ్రేక్ పడినట్లేనని స్పష్టం చేసింది. పెళ్లి త్వరలో చేసుకుంటాననీ, వివరాలు అతిత్వరలో వెల్లడిస్తానని అంది.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT