Kajal Agarwal | Love | Life partener | ఇప్పటివరకూ ప్రేమికుడు తారస పడలేదు: కాజల్
ఇప్పటివరకూ తనకు ఎదురపడ్డ వాళ్లందరిలోనూ స్నేహితుడ్నే చూశాననీ, ప్రేమికుడు, లైఫ్ పార్టనర్‌గా చూడలేదని నటి కాజల్ అగర్వాల్ నొక్కి వక్కాణిస్తోంది.
అలా చూసిన రోజు సదరు వ్యక్తితో తప్పకుండా తలవంచుకుని తాళికట్టించుకుంటానంటోంది.
సినిమాల్లో చూపిన విధంగా లైఫ్‌లో జరుగదనీ, సినిమాల్లో చూపినంతగా ఫీలయ్యే వ్యక్తి దొరకడం అదృష్టమనీ చెపుతోంది.
లేటెస్ట్‌గా సూపర్‌గుడ్ బ్యానర్‌లో రామ్ చరణ్ సరసన నటిస్తోంది. ప్రభాస్ తాజా చిత్రంలోనూ బుక్ అయింది.
ప్రస్తుతం సినిమాల బిజీలో ఉన్నానని చెప్పింది.
