Tarun | Aarthi Agarwal | relation | తరుణ్ - ఆర్తీల పాత పరిచయం పురి విప్పి ఆడుతోందట
WD
ఇలా చేతులు ముందు పెట్టుకుని ఎంతకాలం కూచుంటారూ...? అందుకనేనేమో ఇద్దరూ కలిసి ఎండిపోయిన తమ పాతపరిచయ మోడుకు తిరిగి చిగుర్లు తొడిగించాలని నిశ్చయించుకున్నట్లు టాలీవుడ్ గుసగుసలు పోతోంది. సాయంత్రమైతే సరి... ఇద్దరి ఫోన్లు అదే పనిగా ఎంగేజ్‌గా ఉంటున్నాయట.
ఒకరి బాధను ఒకరు వెళ్లగక్కుకుంటూ, ఓదార్చుకుంటూ... కాలం గడుపుతున్నారట. అయితే ఎటొచ్చీ ఈ సంగతి మళ్లీ తమ తమ పేరెంట్స్‌కు తెలిస్తే ఎక్కడ గొడవైపోతుందోనని ఇద్దరూ రహస్యంగా ఫోన్ సంభాషణలు సాగిస్తున్నట్లు భోగట్టా. మళ్లీ పురివిప్పిన ఈ పాత పరిచయం వీళ్లద్దరినీ ఎక్కడి వరకు తీసుకెళుతుందో చూడాలి మరి...!!
