1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. Kiss

Allu Arjun | Kiss | Varudu | Bhanu Mehra | Lip to lip kiss | హీరోయిన్‌కి ముద్దు పెడితే అల్లు అర్జున్ "బాక్స్" బద్ధలేనా..?!!

అల్లు అర్జున్
WD

ముద్దు పెట్టను కాక పెట్టను

ముద్దు సీన్లు కావాలని పెట్టించుకునే హీరోలు మన టాలీవుడ్‌లో చాలామంది ఉన్నారు. కానీ అల్లు అర్జున్‌కు మాత్రం ముద్దు పెట్టుకున్నప్పుడు బాగానే ఉన్నా.. ఆ తర్వాతే ప్రేక్షకులు తనను ఓ రకంగా చూస్తున్నారని అర్థమయిపోయింది. గతంలో ఆర్య-2లో కాజల్‌తో ముద్దు సీను పెట్టుకున్నాడు. కానీ అది అనుకున్నంత విజయవంతం కాలేదు.

ఆ తర్వాత ఏడాదిపాటు మనసుపెట్టి వరుడు చేశాడు. అందులోనూ హీరోయిన్ భానుశ్రీ మెహ్రాను లిప్ టు లిప్ కిస్ చాలాసేపు పెట్టుకున్నాడు. ఈ చిత్రమూ పెద్దగా ఆదరణ పొందలేదు. పైగా ఆ సీన్ ఎందుకు పెట్టారు..? అది అవసరమా...? అని అడిగితే... కథ డిమాండ్ మేరకే అని అప్పట్లో చెప్పాడు.

అలాంటి వ్యక్తి ప్రస్తుతం తాను నటిస్తున్న బద్రీనాథ్ చిత్రంలో ముద్దు సీన్ లేకుండా చూడండి... అని దర్శకుడిని కోరాడట. పాపం.. అల్లు అర్జున్‌కి ముద్దంటే ఎంత భయమేస్తోందో...?
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT