Actress Bhanusri Mehra | Varudu | Arjun | అబ్బాయి 6 అడుగులైనా ఫర్వాలేదు.. చేసుకుంటా: భానుశ్రీ
వరుడు చిత్రంలో మాదిరిగా ఫోటో చూడకుండా తను ఏకంగా పెళ్లి పీటలపై అబ్బాయిని చూసి చేసుకునే బాపతు కానని హీరోయిన్ భానుశ్రీ మెహ్రా తేల్చి చెప్పింది.
ఆ చిత్రంలో కథ వెరైటీగా ఉందని నటించాననీ, అది నటన వరకే పరిమితమని నొక్కి వక్కాణిస్తోంది.
వరుడు చిత్రం విడుదలయ్యాక ఆఫర్లు వస్తాయని ఆశించిన భానుశ్రీకి పాపం... నిరాశే మిగిలింది. ప్రస్తుతం హైదరాబాదులోనే తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.
భార్యను ప్రేమించే వ్యక్తి కావాలంటూ... తన స్వయంవరం లక్షణాలను వెల్లడించింది. ఒకవైపు పెళ్లి వయసు రాలేదంటూనే అబ్బాయి అలా ఉండాలీ... ఇలా ఉండాలీ అని చెప్పడమెందుకో...?!!
