Kajal Agarwal | Ram Charan | Prabhas | link | love | ప్రభాస్‌తో కూడా కెమిస్ట్రీ ఉందంటారా...?!!: కాజల్ ప్రశ్న
WD
ఆమె ఎటు వెళ్లినా రామ్‌చరణ్‌తో స్నేహం ఎలా సాగుతోందని కాజల్‌ను అడగటం ఎక్కువైంది. ఇటీవల ఓ పిల్ల జర్నలిస్టు ఇదే ప్రశ్నను ఆమె ముందు ఉంచాడట. అంతే..!! అతడిపై ఇంతెత్తున లేచి... రామ్ చరణ్ సరసన రెండో చిత్రం చేస్తున్నందుకు మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ నడుస్తోందని చెపుతున్నారు. మరి ప్రభాస్‌తో డార్లింగ్ చిత్రం చేశాను. మళ్లీ అతనితో మరో సినిమాలో నటిస్తున్నాను. అంతమాత్రాన ప్రభాస్‌తో నాకు కెమిస్ట్రీ ఉన్నట్లా...? అని అతడిపై చిందులు వేసిందట.
ఆమె కోపాన్ని ఆట్టే పట్టించుకోని సదరు పిల్ల జర్నలిస్టు.. ప్రభాస్‌తో కెమిస్ట్రీ లేదని చెపుతున్నారు కనుక రామ్ చరణ్‌తో ఉన్నట్లే అనుకోవాలా...? అని మళ్లీ ప్రశ్నించాడట. ఆ ప్రశ్నతో కాజల్ అగర్వాల్ ఓర్పు పట్టలేక అతడివైపు గుడ్లురిమి చూసి ముక్కు పుటాలను ఎగురవేసి అతడిని మింగేసేట్లు చూసిందట. అంతే... సదరు కుర్రాడు చల్లగా అక్కడి నుంచి జారుకున్నాడట.
