Sneha Ullal | Simha | Balakrishna | Pubs | beer bottles | దేవాలయాల చుట్టూ "సింహా": పార్టీలలో "ఉల్లాల్"
సింహా చిత్రం హిట్‌తో నందమూరి బాలకృష్ణ రాష్ట్రంలో ఉన్న ప్రధాన దేవాలయాలన్నిటినీ సందర్శించి ఆయా దేవదేవుళ్లకు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ చిత్రంలో నటించిన టీనేజ్ హీరోయిన్ స్నేహా ఉల్లాల్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోందట.
పొద్దుపోతే చాలు... తన మిత్ర బృందాన్ని వెంటేసుకుని భాగ్యనగరంలోని ప్రధాన పబ్‌ల్లోకి వెళ్లి ఎంజాయ్ చేస్తోందట. ఈ పార్టీలకు తన చిన్ననాటి స్నేహితులను మరీ గుర్తుకు తెచ్చుకుని ఫోన్ చేసి రమ్మంటోందట. అక్కడ వారికిష్టమైన మెనూను ఆర్డర్ చేసి మజా చేస్తోందట.
అన్నట్లు స్నేహా ఉల్లాల్‌కు కొంతమంది బీర్ కొట్టే స్నేహితులు కూడా ఉన్నారట. వారు ఇష్టపడే ప్రత్యేకమైన బీర్ బ్రాండ్‌లను తనే ఆర్డర్ చేసి తెప్పించి మరీ ఇస్తోందట ఉల్లాల్. స్నేహశీలి స్నేహా ఉల్లాల్ ఆప్యాయతను చూసి స్నేహితుల కళ్లు సంతోషంతో మూతలు పడుతున్నాయట. స్నేహతో స్నేహమంటే అంత "మత్త"న్నమాట.
