1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Neetu Chandra

Item song | Neetu Chandra | Kollywood | ఐటమ్ సాంగ్‌లో నీతూ చంద్రా ఓవర్ ఎక్స్‌పోజింగ్

ఐటమ్ సాంగ్
బాలీవుడ్ సెక్స్ బాంబ్ నీతూచంద్ర మాధవన్ నటించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ "యావరమ్ నలమ్" చిత్రం ద్వారా తమిళ సినిమాల్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత విశాల్ సరసన నటించింది. ఇప్పుడు "యుద్ధం సే" అనే చిత్రంలో ఐటమ్ సాంగ్ చేస్తోంది. 

హీరోయిన్ పాత్రలు కాకుండా ఐటమ్ సాంగ్‌లు చేస్తుండటంతో కోలీవుడ్‌లో ఆమె పని అయిపోయినట్లు కొంతమంది అంటున్నారు. దీనిపై నీతూ చంద్ర మాత్రం మండిపడింది. ఐటమ్ సాంగ్ చేయడం వల్ల తన ఇమేజ్ ఏమాత్రం తగ్గదనీ, పైపెచ్చు అవకాశాలు సైతం తన్నుకొస్తాయని అంటోంది.

అన్నట్లు ఈ ఐటమ్ సాంగ్‌లో నీతూ చంద్ర తన అందాలను పరిమితికి మించి ఆరబోసినట్లు కోలీవుడ్ సినీజనం చెపుతున్నారు. నీతూ ఐటమ్ ఆటను చూసిన పలువురు దర్శకనిర్మాతలు ఆమెను తమ తదుపరి చిత్రాల ఐటమ్ సాంగ్‌లలో నటించమని అడుగుతున్నారట. మరి దీనికేం సమాధానం చెపుతుందో నీతూ..!!