1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. Geetha Arts

Tamanna | Geetha Arts | Allu Arvind | Badrinath | Naga Chaitanya | మీ ఇష్టం వచ్చిన రేటును ఫిక్స్ చేసుకోండి: తమన్నా

తమన్నా
WD
హ్యాపీడేస్ చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేసిన తెల్లపిల్ల తమన్నా తాజా తమిళ చిత్రం "సురా" బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. దీంతో తమిళ నిర్మాతలు ఆమె పారితోషికాన్ని ఉన్నఫళంగా తగ్గించేశారని వినికిడి.

ఇదిలావుంటే ఈ అమ్మడికి టాలీవుడ్ రెడ్ కార్పెట్ వేసి మరీ ఆహ్వానం పలుకుతోంది. ఇప్పటికే అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ ఆమెను రెండు చిత్రాలకు బుక్ చేసుకున్నది. ఇంకా మరికొందరు నిర్మాతలు తమన్నాను తమ చిత్రాలలో నటింపజేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో తన "సురా" ఢమ్‌మని పేలిపోవడంతో తమన్నా ఉన్నఫళంగా కోలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు వచ్చి తన నిర్మాతలతో టచ్‌లో ఉంటోందట. నిర్మాతలు అడగక ముందే తన పారితోషికంలో కత్తెర వేసుకోమని సలహాలు సైతం ఇస్తోందట.

ఈ విషయం నిర్మాతలకు బాగానే ఉన్నప్పటికీ "బద్రీనాథ్" అల్లు అర్జున్‌కు మాత్రం భయం కలిగిస్తోందట. ఇప్పటికే వరుడు చిత్రం ప్లాప్‌తో ఈ కండలవీరుడు కుయ్యోమంటుంటే ఫ్లాప్ హీరోయిన్ జంటగా రూపొందుతోన్న చిత్రం ఏమవుతుందోనన్న బెంగలో ఉన్నాడట.
About Writer
Venkateswara Rao. I
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి