రామ్ గోపాల్ వర్మ నాగార్జునకు "పెద్ద చెంచా"
WD
"శివ" సినిమా తీయడానికి ముందు వర్మ బి.గోపాల్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారట. అప్పట్లో నాగార్జున చిత్రం కలెక్టర్ గారి అబ్బాయి షూటింగ్ జరుగుతుంటే నాగ్‌ను ఇంప్రెస్ చేయడానికి రామ్‌గోపాల్ వర్మ శతవిధాలా ప్రయత్నించేవారట. వర్మ సిన్సియారిటీని చూసిన నాగార్జున కూడా ఆయన పట్ల సానుకూలంగా స్పందించేవారట. దీంతో వర్మను అందరూ "నాగార్జున చెంచా" అని పిలిచేవారట.
కానీ ఆ చెంచా విమర్శలను పట్టించుకోని రామ్‌గోపాల్ వర్మ తను అనుకున్న ప్రాజెక్టు శివ తీసి నాగ్ చెంచా సత్తా ఏమిటో నిరూపించుకున్నారట. బాక్సాఫీసు వద్ద సూపర్ సక్సెస్ సాధించిన శివ చిత్రం తర్వాత వర్మ ఇక వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితే ఎదురు కాలేదు. ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ ఆయనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఉన్నది.

