Dil Raju | Bindu Madhavi | Priya Anand | ఈ హీరోయిన్ల వల్లే "రామరామ కృష్ణకృష్ణ" అందిట
ఈమధ్య హీరోయిన్లపై నిర్మాత దిల్ రాజు విమర్శలు ఎక్కువ చేస్తున్నారు. అది పబ్లిసిటీ స్టంటో లేక హీరోయిన్లపై కోపమో తెలీదు కానీ... ఆమధ్య "మరోచరిత్ర" హీరోయిన్ గురించి చులకనగా మాట్లాడారు. సినిమాకు ఆమె మైనస్ అంటూ విమర్శించారు. అసలు ఆ చిత్రానికి హీరోనే మైనస్ అని కొంతమంది అంటే... దిల్ రాజు "మరోచరిత్ర" సినిమా తీయడమే మైనస్ అని ఇండస్ట్రీలో చాలామంది వ్యాఖ్యానించారు.
వీటన్నింటిపైనా ఎదురుదాడి చేసేందుకు హీరోయిన్‌పై నెపం నెట్టేశారు. తీరా ఆ హీరోయిన్ కూడా ఘాటుగానే స్పందించింది. సెలక్షన్ టైమ్‌లో దగ్గరుండి మరీ ఎంపికచేసిన ఆయన ఏం ఆశించి అలా మాట్లాడారో తెలియదని చురక వేసింది. తాజాగా మరో వివాదం ముందుకు వచ్చింది.
రామ్ హీరోగా "రామరామ కృష్ణకృష్ణ" సినిమాలో అచ్చమైన తెలుగువారని ప్రియా ఆనంద్, బిందు మాధవిని పెట్టామని గొప్పగా చెప్పిన దిల్ రాజు సినిమా విడుదలయ్యాక అది తుస్‌మనే సరికి మా సినిమాకు హీరోయిన్లే మైనస్ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఇప్పుడిప్పుడే కొత్తగా ఇండస్ట్రీలో ఎదుగుతున్నవారు ఖంగుతిన్నారు.
హీరోయిన్లపై ఎందుకంత చులకనో అని వాపోతూ... ఇకపై దిల్ రాజు సినిమాలో తాము నటించబోమని ఘంటాపధంగా చెప్పారు. ఏదేమైనా ఇండస్ట్రీలో నిలబడాలంటే ఎవరో ఒకరు అండ ఉండాలనీ లేకపోతే ఇలాంటి వ్యాఖ్యలు ఎదుర్కోవలసి వస్తుందని ఇండస్ట్రీలో పెద్దలు పేర్కొన్నారు. ఇకనైనా దిల్ రాజు నోటి దురుసు తగ్గించుకోవాలని మరికొంతమంది హీరోయిన్లు వంత పాడారు.
