1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Snake

Mallika Sherawat | Snake | Hisss | Producer | పాములా పాకుతావో..? కప్పలా గెంతుతావో..? మాకెందుకు...?!!

మల్లికా శరావత్
త్వరలో విడుదల కాబోతున్న "హిస్‌స్" చిత్రం కోసం పాములను శరీరంపై వేసుకుని ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు నానా తంటాలు పడుతున్న నాగిని మల్లికా శరావత్‌పై ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ కొరడా ఝుళిపించింది. ఓ హిందీ చిత్రంలో నటిస్తానని చెప్పి ఆనక హిస్‌స్ చిత్రానికి అంకితమైపోయిన మల్లికకు నోటీసులు జారీ చేసింది. 

వివరాల్లోకి వెళితే "మస్కురాడె" చిత్రంలో నటిస్తానని ఒప్పుకుంటూ మల్లికా శరావత్ ఆ చిత్ర నిర్మాత నుంచి 25 లక్షల రూపాయలను తీసుకున్నది. ఆ తర్వాత చెప్పా పెట్టకుండా ఆ ప్రాజెక్టును వదిలేసి నెలల తరబడి హిస్‌స్ చిత్రంలో పాములా నటిస్తూ కాలం గడుపుతోంది. దీంతో చిర్రెత్తిపోయిన దర్శకుడు కుందన్ షా మల్లికా శరావత్‌పై ఫిర్యాదు చేశాడు.

ఆమె పాములా నటిస్తే మాకేంటీ...? కప్పలా గెంతితే మాకేంటీ...? మాకు ఇవ్వాల్సిన డబ్బులు తిరిగి ఇచ్చేస్తే అదే పదివేలు అని అసోసియేషన్ ఎదుట మొరపెట్టుకున్నాడట. దీంతో సదరు అసోసియేషన్ మల్లికా శరావత్‌కు ఆగమేఘాల మీద నోటీసులు జారి చేసి డబ్బులు వాపసు చేయమని కోరింది. అయితే మల్లిక మాత్రం ప్రస్తుతానికి సగం డబ్బులే ఇవ్వగలననీ, మిగిలిన మొత్తం హిస్‌స్ విడుదలైన తర్వాత ఇస్తానని చెప్పిందట.
About Writer
Venkateswara Rao. I