Manchu Manoj | Allu Arjun | Vedam | Anushka | "మంచు"ను మింగేసిన "అల్లు": మనోజ్ కుయ్యో మొర్రో..!!
WD
తాజాగా మంచు మనోజ్, వేదంలో తన పాత్రకు న్యాయం జరగలేదని రుసరుసలాడుతున్నాడట. ఇదే విషయంపై దర్శకుడిపై ధ్వజమెత్తారు. తనకు కథ చెప్పినపుడు 20 సన్నివేశాలు, రెండు పాటలు ఉంటాయని అన్నాడనీ, కానీ సినిమా పూర్తయ్యాక చూసుకుంటే 11 సీన్లు, ఒక్కపాట మాత్రమే తీశారని ధ్వజమెత్తుతున్నాడు.
ఈ విషయాన్ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీ మోహన్‌కి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కాగా ఈ చిత్రం ఈ నెల 4న విడుదల కానుంది. ఇంతకాలం నోరు మెదపని మనోజ్ చిత్రం రిలీజ్‌కు ముందు గొడవ చేయడంలో ఆంతర్యమేమిటని ఇండస్ట్రీ ఆరా తీస్తోంది.
అల్లు అర్జున్ మాత్రం తనదైన శైలిలో కేబుల్ వైర్లను భుజాన వేసుకుని పబ్లిసిటీ స్టంట్‌లో మునిగిపోయాడు. అదేమని అడిగితే "ష్.. ష్.. ష్... నో కామెంట్" అంటున్నాడు. ఇక దర్శకుడైతే సరే... సరి. కథ ప్రకారమే తీశానని చెపుతున్నాడు. మరి మంచు ఏం చేస్తాడో....?!! సినిమా విడుదలకు మరో 18 గంటలే సమయం ఉంది.
