Actress Anushka | Simbu | Love | Kollywood | అనుష్కకు శింబు డైమండ్ నెక్లెస్ గిఫ్ట్.. ఆపై...
WD
ఇక ఆ తర్వాత ఏమైందీ అని చూస్తే... ఇటీవలే శింబు ఖరీదైన ఓ డైమండ్ నెక్లెస్‌ను అనుష్కకు బహూకరించాడట. దానికి తోడు అనుష్క శింబు ఇంటికి కూడా వెళ్లిందట. అక్కడ శింబు తల్లి ఆమెను సాదరంగా ఆహ్వానించి మనస్పూర్తిగా ఆశీర్వదించినట్లు సమాచారం.
ఈ సంగతిని శింబు స్వయంగా ఓ బార్‌లో మందుకొడుతూ అనుష్కతో తనకు గల సాన్నిహిత్యాన్ని వివరించడమే కాక త్వరలో ఆమెను పెండ్లి చేసుకుంటానని చెప్పినట్లు అతడి సన్నిహితులు చెపుతున్నారు.
అయితే ఈ విషయమై అనుష్కను అడిగితే.. ప్రేమా లేదూ... దోమా లేదూ. అసలు శింబు ఎవరూ...? అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తోందట. అదిసరే.. మరి గిప్ట్‌లు మాటో అంటే నోరు మెదపకుండా అక్కడ నుంచి లేచిళ్లి పోయిందట. అంటే అది నిజమనుకోవాలా...? అబద్ధమనుకోవాలా...? ఈ సంగతి మరోసారి అడుగుదాం.
అన్నట్లు రేపు విడుదల కానున్న వేదం చిత్రంలో అనుష్క వేశ్య పాత్రలో నటించింది. అటువంటి పాత్ర ఎందుకు చేశావని అడిగితే... కొత్తదనం కోసం అని బదులిచ్చింది. మంచి సెలక్షనే కదా..!!
