1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. Birth day

Actress Rambha | Birth day | June 5 | husband Indiran | మా ఆయన నాకేదో సర్‌ప్రైజింగ్ గిఫ్ట్ ఇస్తాడు: రంభ

రంభ
WD
కెనడాకు చెందిన ఇందిరన్ అనే వ్యాపారవేత్తను వివాహమాడిన గ్లామర్ క్వీన్ రంభ తన పుట్టినరోజు సెలబ్రేషన్ కోసం ఇండియా వచ్చింది. తన భర్త తన పుట్టినరోజును తన పుట్టిన గడ్డపై చేసుకోమని మరీమరీ పంపారని ఎంతో సంతోషంగా చెపుతోంది.

అంతేకాదు... పుట్టినరోజు కానుకగా తనకు చెప్పకుండా ఏదో సర్‌ప్రైజింగ్ గిఫ్ట్ కూడా ఇస్తానని తనతో చెప్పాడని రెండు పెదవులను బాగా సాగదీసి మరీ నవ్వుతూ చెపుతోంది.

"నీ అభిమానులు, నీ కుటుంబం మధ్య పుట్టినరోజు సంబరం చేసుకుంటే ఆ సంతోషమే వేరు... అందుకనే నీ పుట్టినరోజు వేడుకను అక్కడే చేసుకో" అని తన భర్త ఎంతో ప్రేమగా చెప్పారని మురిసిపోతూ చెపుతోంది రంభ. పెళ్లయిన తర్వాత తనకిది తొలి పుట్టినరోజు పండుగ అనీ, కెనడాకు వెళ్లిన తర్వాత తన భర్త ఇందిరన్ తనకు కొత్త లోకాన్ని చూపించాడని ఆయనపై పొగడ్తల వర్షం కురిపిస్తోంది.

జూన్ 5న.... అంటే ఈరోజే రంభ పుట్టిన రోజు. మరి రంభ భర్త ఇచ్చే ఆ ఎదురు చూడని బహుమతి ఏమిటో తెలుసుకోవాలంటే ఇవాళ సాయంత్రం దాకా ఆగాల్సిందే.
About Writer
Venkateswara Rao. I
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి