1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Kamal

Actress Trisha | Kamal | Lip Lock | KS Ravi Kumar | ప్లీజ్ కమల్... త్రిష పెదవులను గాఢంగా చుంబించవూ..!!

త్రిష
కమల్ హాసన్‌తో నటించే ఏ నటైనా ఖచ్చితంగా ఆయన ముద్దు రుచి ఎలా ఉంటుందో చూసి తీరాల్సిందే. ఈ నేపధ్యంలో తాజాగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో కమల్ హాసన్, త్రిష జోడీగా రూపొందనున్న "మన్మథన్ అంబు" చిత్రంపై తమిళ చిత్ర పరిశ్రమలో బెట్టింగ్‌లు జోరుగా చోటుచేసుకుంటున్నట్లు కోలీవుడ్ న్యూస్. 

కమల్ - త్రిషల మధ్య లిప్ టు లిప్ సన్నివేశం ఉంటుందా...? ఉండదా...? అనే ప్రశ్నపై పందేలు వేసుకుంటున్నట్లు భోగట్టా. సహజంగా క్రీడల్లో ఇటువంటి బెట్టింగ్‌లు చోటుచేసుకోవడాన్ని మనం చూస్తుంటాం. కానీ త్రిష - కమల్ ముద్దు సన్నివేశంపై వేల రూపాయల్లో పోటీకి దిగడం కాస్తంత ఆశ్చర్యం కల్గించే అంశమే మరి.

అంతేకాదండోయ్... కొంతమందైతే కమల్ హాసన్‌కు సెల్‌ఫోన్ల ద్వారా "కమల్... త్రిష పెదవులను గాఢంగా చుంబించే సన్నివేశంలో నీవు నటిస్తే చూడాలనుంది. ప్లీజ్.. త్రిషకు లిప్ టు లిప్ ముద్దివ్వవూ.." అనే సందేశాలను పంపుతున్నారట. మరి కమల్ హాసన్ త్రిష పెదవులను ఏం చేస్తాడో చూడాలి మరి...!!