Kangana Ranout | Bollywood | Hot actress | Sexy | నేను వస్తున్నా: కంగనా - నీకంత సీన్ లేదు: టాలీవుడ్
బాలీవుడ్ తెల్లపిల్ల కంగనా రనౌత్ మరోసారి టాలీవుడ్ వస్తున్నట్లు ప్రకటించింది. టాలీవుడ్ సినిమా వాళ్లు తనకు ఎంతో నచ్చారనీ, వారి వద్ద పనిచేస్తున్నప్పుడు అసలు సమయమే తెలియదనీ... ఇంకా ఇలా ఏవేపో ఐస్ పెట్టే కొంతమంది హీరోయిన్ల మాటలనే తనూ చెపుతోందట.
అయితే "ఏక్ నిరంజన్" అట్టర్ ప్లాప్ దెబ్బకు కంగనా పేరు చెబితేనే నిర్మాతలు పారిపోతున్నారట. ఆమె ఫలానా నిర్మాత వద్దకు వస్తున్నానని కబురు పంపితే చాలు..!! సదరు నిర్మాత తన అసిస్టెంటుతో తాను ఊర్లో లేనని చెప్పమని అంటున్నాడట.
కంగనా మాత్రం తన పట్టును వదలట్లేదట. ఏక్ నిరంజన్ సినిమా టైమ్‌లో తన పెదవులు రెండూ వాచిపోయి చూసేందుకు అదోలా అనిపించాయనీ, అప్పట్లో అది తననూ ఇబ్బంది పెట్టిందనీ, కానీ ఇప్పుడు అన్నీ సర్దుకుని అందంగా మారిపోయానని ఫోటోలు కూడా పంపిస్తోందట.
