Allu Arjun | Actress | Hansika | Sheena | Badrinath | అల్లు అర్జున్‌కి హీరోయిన్ సహకరించకపోతే.. అంతేనట!!
WD
"వేదం"లో కూడా దర్శకుడు ఎంపిక చేసినవారిని కాకుండా దీక్షా సేథ్ అనే అమ్మాయిని అల్లు అర్జునే సెలెక్ట్ చేశాడట. తాజాగా గీతాఆర్ట్స్‌లో రూపుదిద్దుకుంటోన్న "బద్రినాథ్"లో ముందుగా హన్సికను అనుకున్నారట. అయితే ఆమె పారితోషకం ఎక్కువ డిమాండ్ చేయడంతో షీనాను ఎంపిక చేసినట్లు తెలిసింది.
షీనా మంచుమనోజ్ నటించిన బిందాస్‌లో నటించింది. వివి వినాయక్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ చిత్రంలో అవకాశం రావడం చాలా హ్యాపీగా ఫీలవుతున్నట్లు చెపుతోంది. హన్సిక కూడా మొదట్లో అలాగే ఫీలయ్యేది. దేశముదురులో సహకరించినంతగా తర్వాత సహకరించలేదని పారితోషికం డిమాండ్ అనే నెపంతో ఆమెను తప్పించినట్లు సమాచారం.
