Actress Rambha | Indran | Canada | Dane pups | pet dog | మా ఆయనకు 4, నాకు 9 కుక్కపిల్లలు: రంభ
పుట్టిన రోజుకని కెనడా నుంచి చెన్నై వచ్చిన రంభ, ప్రస్తుతం ఇంట్లో ఏమీ తోచక కుక్కపిల్లలతో ఆడుకుంటూ కనిపిస్తోందట.
తన ఇంట్లో ఎప్పుడూ 9కి తగ్గకుండా కుక్కపిల్లలుంటాయంటోంది రంభ. చిన్నప్పట్నుంచి తనకు కుక్క పిల్లలంటే ఎంతో ఇష్టమనీ, బుజ్జి కుక్కపిల్లలను చూస్తే వదలలేనని చెప్పుకొచ్చింది.
అదిసరే ఈ కుక్కపిల్లలతో ఆడుకోవడాన్ని చూస్తే మీ ఆయన ఊరుకుంటాడా...? ఏమన్నా అనడూ...? అని ప్రశ్నిస్తే, పగలబడి నవ్వుతూ... నేనూ మీలాగే అనుకున్నా.
అందుకే అంటారు... ఇద్దరి అభిరుచులు ఒక్కటైనప్పుడే పెళ్లి కుదురుతుందని చెప్పి ఫినిషింగ్ టచ్ ఇచ్చింది రంభ. అంటే కుక్కపిల్లల విషయంలోనని మనం అనుకోవాలా...?!
