1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. Vedam

Anushka | Vedam | Sex worker | Saroja | ''వేదం''లో నా వేశ్య పాత్రకు అంత సీన్‌లేదు..!: సరోజ

అనుష్క
WD
"నేను వేశ్య పాత్ర వేసినంత మాత్రనా వారి దగ్గరకు వెళ్ళి పరిశీలించిరాలేదు" అని అందాల బొమ్మ అనుష్క అంటోంది. ఏవో కొన్ని ఇంటర్నేషనల్ అవార్డుల కోసం వెళ్ళే చిత్రాలైతే అలా హార్డ్ హోమ్‌వర్క్ చేయొచ్చు.

'కానీ "వేదం"లో నా పాత్రకు అంత సీన్‌లేదు. దర్శకుడు రాధాకృష్ణ చెప్పిన వరకే చేశాను. బహుశా ఆయనకు ఆ అనుభవం ఉందేమోనని అనుష్క నవ్వుతూ చెప్పింది. నా పాత్రను దర్శకుడు తీర్చిదిద్దడంలో పలు జాగ్రత్త తీసుకున్నారని తెలిపింది. అందం గురించి చెబుతూ.. ఇది పుట్టుకతో రావాలి. యోగా అనే దాన్ని మెరుగులు దిద్దడానికి సరిపోతుంది' అని సెలవిచ్చింది.

మరోవైపు.. ఆదివారం జరిగిన టాలీవుడ్ క్రికెట్ మ్యాచ్‌ల్లో పాల్గొన్న అనుష్క అభిమానుల్ని అలరించింది. ఇప్పటికే చాలా చోట్ల సరోజ అని ఆమెను పిలుస్తున్నారు. అలాగే స్టేడియంలోనూ అనుష్కను సరోజ అనే పేరుతో అభిమానులు పిలిచారు. కానీ దేన్నైనా స్పోర్టివ్‌గా తీసుకుంటున్నానని ఈ బిల్లా సుందరి చెప్పింది.