1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Malayalam film

Actress Sneha | Malayalam film | mother | Mohanlal | స్నేహా... శ్రేయకు తల్లిగా నటిస్తావా...?

స్నేహ
ముద్దందాల తార స్నేహ తను అమ్మ పాత్ర పోషించబోతున్నట్లు వచ్చిన వార్తలను తోసిపుచ్చింది. అమ్మ పాత్రల్లో కనిపించేటంత వయసుకు తానింకా చేరుకోలేదని చెపుతోంది. కానీ మలయాళ చిత్రంలో అమ్మలా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయే అని అడిగితే... అదంతా శుద్ధ అబద్ధమని కొట్టి పారేసింది. 

అయితే మోహన్‌లాల్ హీరోగా షికార్ అనే చిత్రంలో ప్రేమించి పెళ్లి చేసుకునే అమ్మాయి పాత్రలో నటిస్తున్నానంది. ఆ చిత్రంలో మోహన్ లాల్‌ ఓ అమ్మాయిని దత్తత తీసుకుంటాడు... అది కూడా సినిమాలో నా పాత్ర మరణించిన తర్వాత మాత్రమే. కనుక ఆ అమ్మాయికి అమ్మగా నటించే అవకాశమే లేదని తేల్చి చెపుతోంది.

ఇదిలావుంటే ఇటీవల దర్శకుడు కె.ఎస్.రవికుమార్ స్నేహను సంప్రదించి శ్రేయకు అమ్మగా నటించమని అడిగాడట. రవి కుమార్ మాటలకు కట్టలు తెంచుకునే కోపం వచ్చినప్పటికీ దాన్ని అదిమిపట్టి మర్యాదగానే తను తల్లి పాత్రలో నటించనని చెప్పేసిందట.
About Writer
Venkateswara Rao. I