1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. Bunny

Vedam | Bunny | Anushka | Allu Arjun | Manchu Manoj | బన్నీకి నేను నచ్చడంతోనే.. ఆ ఛాన్సొచ్చింది..!: వైశాలి!

వేదం
WD
ధనవంతుల అమ్మాయిగా "వేదం"లో నటించిన దీక్షసేథ్ అసలు పేరు వైశాలి. ఇంట్లో అంతా అలానే పిలుస్తారు. మిస్ ఇండియా 2009 పోటీల్లో పాల్గొని "మిస్‌ప్రెస్‌ఫేస్ అవార్డు"ను గెలుచుకుంది. తర్వాత సౌత్‌స్కోప్ అవార్డు కార్యక్రమంలో ఆమెను చూసిన దర్శకుడు క్రిష్‌ వేదంలో పాత్ర గురించి చెప్పారట.

కానీ "వేదం"లో ధనవంతుల అమ్మాయిగా నటించే ఛాన్సు బన్నీ ద్వారానే తనకు వచ్చిందని వైశాలి అంటోంది. "సౌత్‌స్కోప్ అవార్డు కార్యక్రమంలో నన్ను చూసిన క్రిష్ వేదంలో పాత్ర గురించి చెప్పారు. ఆ తర్వాత బన్నీకి పరిచయం చేశారు. ఆయనకూ నేను నచ్చడంతోనే.., వేదంలో నటించే ఛాన్సు నాకు వచ్చింది.' అని వైశాలి చెప్పింది.

ఇంకా వైశాలి మాట్లాడుతూ.. 'బన్నీ సెట్లో ఉంటే అందరినీ నవ్విస్తూ ఉత్సాహపరుస్తారు. ఆయనతో ఉంటే కొత్త ఉత్సాహం వస్తుంది. అనుష్క చాలా అందంగా ఉంటుంది. వేదంలో సరోజ పాత్రలో లీనమైపోయింది" అని ఈ పంజాబీ భామ కితాబిచ్చింది.

ఇంకేముంది..? వైశాలి మాటలను బట్టి చూస్తే.. బన్నీకి నచ్చితేనే హీరోయిన్ సెలక్షన్ జరుగుతుందన్నమాట నిజంచేసినట్లుందని సినీ పండితులు గుసగుసలాడుకుంటున్నారు.
About Writer
SELVI.M