1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Broker

RP Patnaik | Broker | Asha Sainee | ఆర్పీ పట్నాయక్ "బ్రోకర్" సరసన లక్స్ పాప

ఆర్పీ పట్నాయక్
లక్స్ పాప... లక్స్ పాప లంచ్ కొస్తావా..? అని బాలయ్యతో అనిపించుకున్న ఆషాశైనీ సడెన్‌గా తన సెక్సీ ఇమేజ్‌కు కట్ కొట్టి పూర్తి సంప్రదాయ చీరకట్టులో దర్శనమిస్తోంది. మరో విశేషమేమిటంటే... హీరోగాని హీరో ఆర్పీ పట్నాయక్ సరసన నటించడం. 

తొలుత సెక్సీ పాత్రలతో కుర్రకారు గుండెల్ని గుల్ల చేసిన ఆషాకు అనుకున్నంత స్థాయిలో అవకాశాలు తలుపు తట్టలేదు. అయినప్పటికీ కొన్నాళ్లపాటు సెక్సీ పాత్రలే చేస్తాననీ, గ్లామర్ పాత్రల్లో విరగదీస్తానని తెగ రెచ్చిపోయింది. కానీ ఎంత గింజుకున్నా అవకాశాలు మాత్రం ఆమె తలుపు తట్టలేదు. దీంతో విసిగిపోయిన ఆషా.. చివరికి ఇలా చిన్నచిన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల సరసన చేసేందుకు సై అంటోంది.

ఆర్పీ పట్నాయక్ హీరోగా "బ్రోకర్" అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ ఏడాది అక్టోబరు నెలలో విడుదల చేస్తామని దర్శకనిర్మాతలు అంటున్నారు. చూద్దాం... సంప్రదాయ పాత్రల్లో ఆషా శైనీ ఎంతవరకు సక్సెస్ అవగలదో...!!
About Writer
Venkateswara Rao. I