1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Actress

Sameera Reddy | Actress | Bollywood | ఒంటరితనాన్ని తట్టుకోలేక పోతున్నా: సమీర

సమీరా రెడ్డి
బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న సమీరా రెడ్డి ఒంటరితనాన్ని తట్టుకోలేక పోతున్నానని చెపుతోంది. అందుకనే సాయంత్రం పూట ఆరు గంటల నుంచి తెల్లవారు ఝాము 3 గంటల వరకూ షూటింగ్‌లో పాల్గొనేందుకు ఉత్సాహాన్ని చూపుతున్నట్లు చెప్పుకొచ్చింది.

ఇక ఇటీవల కోలీవుడ్‌పై దృష్టి సారించాననీ, అక్కడి నడిగర్ సంఘం అంటే తనకు ఎంతగానో ఇష్టమని అంటోంది. నడిగర్ సంఘంలోని సభ్యులు తనను పిలిచి మరీ అవకాశాలు ఇస్తారని వారిపై పొగడ్తలు కురిపించింది.

పెళ్లి గురించి ప్రస్తావన తెచ్చినప్పుడు నవ్వుతూ... తాను ఒంటరిగానే ఉన్నాననీ, అయితే ఈ వంటరితనాన్ని తట్టుకోలేక పోతున్నానని అంటోంది. మనసుకు నచ్చిన పురుషుడు తగిలినపుడు వెంటనే పెళ్లి చేసుకుంటానని సెలవిచ్చింది. మరి సమీర మనసు దోచే మగాడెవరో చూడాల్సిందే...!!
About Writer
Venkateswara Rao. I