1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Kollywood

Tamannah | Kollywood | Anushka | తమన్నాను వదల్లేకపోతున్నా: అనుష్క

తమన్నా
టాలీవుడ్ సూపర్ క్వీన్ అనుష్క అంటే అతిశయోక్తి కాదేమో. కానీ ఈ భామ తాను గెడకర్రలా అందరి హీరోయిన్లకంటే ఎత్తుగా ఉన్నందుకు ఫీలవుతోందట. తమన్నాలా కాస్త మట్టసంగా ఉంటే చాలా బావుండేదని అంటోదట.

అన్నట్లు ఇటీవల ఓ టెలివిజన్‌లో తమన్నాతో కలిసి అనుష్క ఓ ఇంటర్య్యూ ఇచ్చిందట. ఆ కాసేపు ఆమెతో గడిపినందుకు మనసుకు ఎంతో హాయిగా అనిపించిందట. ఇక అప్పట్నుంచి తమన్నాను వదల్లేక పోతున్నానని చెపుతోందట. అంతేకాదు డైరెక్టుగా తమన్నాకు ఫోన్ చేసి అదే పనిగా గంటల తరబడి సుత్తి కొడుతోందట.

ఇదిలావుంటే అనుష్క నటించిన తమిళ సినిమా సింగం సూపర్ హిట్ అవడంతో తన మకాన్ని కోలీవుడ్‌కు మార్చేసే ఆలోచనలో ఉన్నట్లు కోలీవుడ్ టాక్. ఎలాగూ తమన్నా క్లోజ్ ఫ్రెండ్ అయింది కనుక అక్కడకు వెళితే ఎంచక్కా ఇద్దరూ బాతాఖానీ కొట్టుకోవచ్చు.

అనుష్క కోలీవుడ్‌లో సెటిల్ అయితే టాలీవుడ్‌లోని అనుష్క ఫ్రెండ్స్ ఆమెపై బెంగెట్టుకోరూ...?!!