బిగ్ బి మార్కుల కోసం చిత్రాలు తీయలేదు: మణిరత్నం
WD
మణిరత్నం స్వీయదర్శకత్వంలో నిర్మించి ఇటీవల విడుదలైన 'రావణ్' చిత్రంపై అమితాబ్ బచ్చన్ విమర్శలు చేసిన విషయం తెల్సిందే. చిత్రం ఎడిటింగ్‌లో లోపాలు ఉన్నాయని, అందువల్ల ఈ చిత్రంలో తన కుమారుడు అభిషేక్ బచ్చన్ అద్భుతమైన నట మరుగున పడిపోయిందని తన బ్లాగులో బిగ్ బి విమర్శలు చేశారు.
దీనిపై మణిరత్నం ఘాటుగానే స్పందించారు. ఎవరి అభిప్రాయాలు వారికుంటాయని, వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. తాను సినిమాలు తీసేది అమితాబ్ నుంచి మార్కులు పొందేందుకు కాదని మణిరత్నం ఘాటుగా బదులిచ్చారు. దర్శకుడిగా చెప్పదలచుకున్నది తెరపై ఉండేలా చూడటమే తమ ప్రథమ కర్తవ్యమన్నారు.

