Priyamani | Roja | Sigar | Tollywood | ప్రియమణి సిగరెట్ దమ్ము... రోజా బూతు పురాణం
WD
నటి ప్రియమణి, రోజాల విషయంలో ఇదే జరిగింది. గోలీమార్ షూటింగ్‌లో ఉండగా ఇద్దరికీ ఏమాత్రం గ్యాప్ దొరికినా బూతులు మాట్లాడుకునేవారట. ఇది విన్న యూనిట్‌వారే ఆశ్చర్య పోయారట. రోజా ఎలాగూ రాజకీయ నాయకురాలిగా పబ్లిక్‌గానే బూతులు మాట్లాడుతుందనుకోండి.
ఈ సంగతి ఇలా ఉంటే... దర్శకుడు పూరీ జగన్నాథ్ తాగే మెంథాల్ సిగరెట్‌ను ప్రియమణి అడిగి మరీ తీసుకుని గుప్పుగుప్పుమంటూ రింగురింగుల పొగలతో ముంచేత్తేదట. అది తాగితే పెదాలు నల్లబడవనీ, షూటింగ్ చేసేందుకు కొత్త ఎనర్జీ వస్తుందనే లాజిక్కు కూడా చెప్పేసిందట.
అన్నట్లు ఇటీవల టాలీవుడ్ టీ-20 క్రికెట్ మ్యాచ్‌లో కూడా మిగిలిన తారామణులకంటే ప్రియమణే బాగా జోరు చేసింది కదూ.. ఆ ఎనర్జీ వెనుక కారణం కూడా ఇదేనేమో...!!
