1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Football

FIFA | Football | Sameera Reddy | ఆ బంతులాట ప్రత్యక్షంగా చూడాల్సిందే: సమీర

ఫిఫా
సమీరా రెడ్డి తన తాజా చిత్రాల్లో విశ్వరూపం చూపిస్తానంటోంది. ఆ సంగతి ప్రక్కనపెడితే అమ్మడికి బంతులాడుకునే ఆటంటే ఎంతో ఇష్టమట. ముఖ్యంగా ఇటీవల ప్రారంభమైన ఫిఫా ఫుట్‌బాల్ మ్యాచ్ చూడాలని ప్రాణం కొట్టుకుంటోందనీ, అయితే షూటింగ్‌ల బిజీవల్ల వెళ్లలేక పోతున్నానని వాపోతోంది సమీర. 

టీవీల్లో వస్తోంది చూడొచ్చు కదా... అంటే, ఆ బంతులాటను ప్రత్యక్షంగా చూసినప్పుడే థ్రిల్ కలుగుతుందని చెపుతోంది. ప్రత్యక్షంగా చూసిన ఫీలింగ్ టీవీలో చూస్తే ఎలా కలుగుతుందీ...? అని ప్రశ్నిస్తోంది.

ఫుట్‌బాల్ అంటే ఎందుకంత ఇష్టం అని కదిలిస్తే... చిన్నప్పటి సంగతులు చెప్పుకొచ్చింది. తాను బాల్యంలో ఉన్నప్పుడు తన ఇంటి ఆవరణలో ఫుట్‌బాల్ ఆడేదాన్నని చెప్పింది. తనతో ఆడేందుకు ఎవరూ లేకపోతే తన ఇంట్లో ఉన్న కుక్కపిల్లతో బంతాట ఆడుకునే దాన్నని చెప్పింది.

సినిమాలు గురించి చెపుతూ.. సినిమాలు కూడా ఫుట్‌బాల్ మ్యాచ్ లాంటివేనని అంది. బంతాటలో ఎవరు నెగ్గుతారో, ఎవరు ఓడిపోతారో చెప్పలేం. సినిమాలు కూడా అంతే. మనసు పెట్టి నటిస్తాం. అది హిట్ అవుతుందో ఫట్ అవుతుందో చెప్పలేం. ఒకవేళ హిట్ అయితే కప్ వచ్చినట్లే. బోల్తా కొడితే బంతాటలో ఓడిపోయి మొహాలు వేళాడేసుకుని ఇంటిముఖం పట్టే క్రీడాకారుల్లా నటీనటులు ఉసూరుమనాల్సిందే అని చెప్పింది సమీర.
About Writer
Venkateswara Rao. I