Namitha | Night | Simha | Tollywood | Hyderabad | రాత్రిపూట డిస్కషన్స్‌తో నమిత ఫుల్ బిజీ
సింహా తెచ్చిన హిట్‌తో నమిత రేంజ్ ఒక్కసారిగా ఎక్కడికో వెళ్లిపోయింది. ఇపుడామె కాల్షీట్లకోసం టాలీవుడ్ దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారట. కొంతమందైతే తమ తదుపరి చిత్రాల్లో నటించాలని నమితపై ఒత్తిడి తీసుక వస్తున్నారు. ఇంకొంతమంది... తాము తీయబోయే సినిమాలో నమితకు ఎటువంటి పాత్రను ఇవ్వబోతున్నారో విడమరిచి చెప్పేందకు రాత్రిపూట కథా చర్చలకు నమితను ఆహ్వానిస్తున్నారట.
దీంతో నమిత సంతోషానికి పట్టపగ్గాల్లేకుండా పోయిందట. అడిగినవారిని నొప్పించడం ఇష్టం లేక రాత్రిపూట కథా చర్చలకు వెళుతోందట. సుదీర్ఘమైన చర్చలు ఫలితమో... ఏమోగానీ రాత్రంతా నైట్ అవుట్ చేస్తుండటంతో నమిత ఒళ్లు అలసి పోయి కళ్లు కాస్త గుంటలు పడి నీరసం కనిపిస్తోందట.
పగటివేళ ఎడతెరపిలేని షూటింగ్‌లు ఉండటంతో కథా చర్చలకు రాత్రివేళ వెళ్లక తప్పడం లేదట. వెనకటికెవరో చెప్పినట్లు... అదృష్టం తన్నుక వస్తే రోజుకు 24 గంటలు కాదు.. 48 గంటలు ఉంటే బావుండునన్న సామెతలా నమిత పరిస్థితి తయారైందట. 24 గంటల్లోని 12 గంటల రాత్రికే కళ్లు పీక్కుపోతుంటే 24 గంటల రాత్రైతే నీ ఆరోగ్యం ఏం గానూ... అని ఆమె సన్నిహితులు వ్యాఖ్యలు చేస్తున్నారట. ఏం సినిమాలో.. ఏం నైట్ చర్చలో...!!
